కామారెడ్డి, మే 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బ్యాటరీ ట్రై సైకిళ్ళ రిపేరింగ్ పై శశిక్షణ ఇచ్చుటకు మెకానిక్ రిపేరింగ్ లో అనుభవం గల దివ్యాంగుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమాధికారి బావయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని ఇద్దరు దివ్యాంగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వికలాంగుల ఆర్ధిక పునరావాస పధకం క్రింద ఋణం అందిస్తామని ఆయన తెలిపారు. ఆసక్తి గల దివ్యాంగులు జూన్ 3 న సాయంత్రంలోగా కలెక్టరేట్ లోని 31 గదిలో గల జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, వివరాలకు కార్యాలయ పనివేళల్లో అధికారులను సంప్రదించవచ్చని బావయ్య తెలిపారు.