నిజామాబాద్, మే 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని ఆనంత్ గ్యాస్ ఏజెన్సీ మరియు శేఖర్ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న డెలివరీ కార్మికుల 5వ రోజు సమ్మెలో భాగంగా అనంత్ గ్యాస్ ఏజెన్సీ ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి హనుమాన్లు మాట్లాడుతూ ఐదు రోజులుగా సమ్మె చేస్తుంటే యాజమాన్యం స్పందించక పోవడం సిగ్గుచేటు అన్నారు. కార్మికులకు చట్ట ప్రకారం రావలసిన చార్జీలను కూడా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన ఇప్పించక పోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం మరియు యాజమాన్యం స్పందించి కార్మిక సంఘ నాయకులకు కార్మికులను పిలిచి సమస్య పరిష్కరించాలని లేనియెడల సమ్మె ఉధృతం చేస్తామని అన్నారు.
కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు గాండ్ల సాయన్న, నాయకులు రవికుమార్, బాల లింగం, బబ్లు, రాజు, నయీమ్ గంగాధర, ప్రసాద్, శివకుమార్ కార్మికు లు తదితరులు పాల్గొన్నారు.