కామారెడ్డి, మే 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా పరిషద్ సాధారణ సర్వ సభ్య సమావేశం జూన్ 7 న ఉదయం పదిన్నర గంటలకు కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరం నందు జెడ్పి అధ్యక్షురాలు దఫెదార్ శోభ రాజు అద్యక్షతన జరుగుతుందని జెడ్పి ముఖ్య కార్యనిర్వాహనాధికారి చందర్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సభ్యులు, అధికారులు సకాలంలో సమావేశానికి హాజరు కావలసినదిగా ఆయన కోరారు. సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే రీతిలో అధికారులు సమగ్ర వివరాలతో సమావేశానికి రావాలని విజ్ఞప్తి చేశారు.