కామారెడ్డి, మే 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి మండలం క్యాతంపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించి పురోగతిపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న టాయిలెట్స్ ఎలక్ట్రిసిటీ ప్లంబింగ్ పనులను పరిశీలించి రెండు రోజులలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణ సువిశాలంగా ఉన్నందున రాబోయే మూడు, నాలుగు రోజులలో యువత భాగస్వామ్యంతో శ్రమదానం, మొక్కల పెంపకం విరివిగా చేపట్టాలని అన్నారు.
కార్యక్రమంలో డీఈఓ రాజు, ఎంపీడీవో నాగ వర్ధన్, ఎంపీవో మలహరి, ఎంఈఓ ఎల్లయ్య, పంచాయతీ రాజ్ ఏఈ ఆదిత్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.