కామారెడ్డి, జూన్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
శుక్రవారం నాడు 66 లారీలు సమకూర్చి 14 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,580 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించామని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ తెలిపారు. ప్రస్తుత యాసంగి కొనుగోళ్ళకు సంబంధించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు గత మార్చి 26 న ప్రాథమిక సహాకార సంఘాల ద్వారా 327, ఐకెపి ద్వారా 23 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
336 కేంద్రాలలో కొనుగోళ్లు పూర్తయ్యాయని, మరో 14 కేంద్రాలలో కొనుగోళ్ల ప్రక్రియ సాగుతున్నదని ఆయన తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 54,353 మంది రైతుల నుండి 3,12,492 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. 98 శాతం ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి 94 శాతం మేర అనగా 645 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమచేశామని చంద్ర మోహన్ తెలిపారు.