కౌంటింగ్‌ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిచ్పల్లిలోని సీఎంసీ కేంద్రాన్ని జనరల్‌ అబ్జర్వర్‌ ఎలిస్‌ వజ్‌ ఆర్‌ తో కలిసి కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌, ఇతర అధికారులు ఆదివారం సందర్శించారు. పార్లమెంటు నియోజకవర్గంలోని బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్‌ కోసం చేసిన ఏర్పాట్లను నిశితంగా పరిశీలన జరిపారు.

ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నియోజకవర్గ వివరాలను తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని, ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను అభ్యర్థులు, వారి ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈవీఎం ల ఓట్లను ఒక్కో రౌండ్‌ వారీగా జాగ్రత్తగా లెక్కిస్తూ, ప్రతి రౌండ్‌ కు ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని అన్నారు.

ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు వచ్చి సరిచేస్తారని, కౌంటింగ్‌ ప్రక్రియను యధాతథంగా కొనసాగించాలని తెలిపారు. కౌంటింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బందితో పాటు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వివిధ కార్యకలాపాల నిర్వహణ కోసం నియమించబడిన వారికి పాసులు అందించాలని, పాసు కలిగి ఉన్న వారినే కౌంటింగ్‌ సెంటర్‌ లోనికి అనుమతించాలని సూచించారు.

అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా తుది ఏర్పాట్లను సరిచేసుకోవాలని, ఎలాంటి గందరగోళానికి తావులేకుండా పక్కాగా నిబంధనలను పాటిస్తూ, పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కౌంటింగ్‌ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హితవు పలికారు. ఎలాంటి అపశ్రుతులు తావు లేకుండా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తూ, అవసరమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామని సీ.పీ కల్మేశ్వర్‌ అన్నారు.

కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ మకరంద్‌, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్‌ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »