నిజామాబాద్, జూన్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఉద్యమాలను నిర్మించి, ప్రజలను మమేకం చేసి విజయ తీరాలను చేర్చేది కవిత్వం అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి శంకర్ అన్నారు. ఆయన హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో, తెలంగాణ అభివృద్ధిలో కవులు రచయితల పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ పురస్కారాన్ని అందుకున్న జేఏసీ చైర్మన్ మోరేశ్వర్ భాస్కర్ కు అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హరిదా రచయితల సంఘం ఉద్యమకారులను గుర్తించి గౌరవించడం అభినందనీయమని తెలిపారు. ఉద్యమ కాలంలో భాస్కర్ చేసిన కృషి ప్రణాళిక బద్ధంగా ఉద్యమకారులను ముందుకు నడిపిందని తెలియజేశారు. గల్లీ నుంచి ఢల్లీి దాకా భాస్కర్ పాల్గొన్న అనేక సందర్భాలు ఆదర్శనీయమన్నారు.
సభకు అధ్యక్షత వహించిన ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ ఉద్యమ కాలంలో కవిత్వం ప్రశ్నలాగా పోరాడితే ఉద్యమానంతరం లక్షణాలతో వర్ధిల్లుతుందని రెండిటి లక్ష్యం ప్రజా చైతన్యమైనని అన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ప్రముఖ కవి సిహెచ్ ప్రకాష్ మాట్లాడుతూ ఉద్యమ కాలంలో నిజామాబాద్ జిల్లా నిప్పు కనికల విశ్రమించిందని అన్నారు. మరో గౌరవ అతిథి పంచ రెడ్డి లక్ష్మణ మాట్లాడుతూ 1969 ఉద్యమం చూపిన బాటలో బలిదశ ఉద్యమం విజయం సాధించిందని అన్నారు.
తనకు హరిదార చేతుల సంఘం అందించిన పురస్కారం మొత్తం తెలంగాణ ఉద్యమకారుల అందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, ఉద్యమ ఫలాలు ప్రజల ఒడిలోకి చేరే దాకా తమ పోరాటం ఆగదని మోరీశ్వర్ భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుకూరి సాయిబాబా రచించిన కథ ‘‘అనుపమానం అన్నదానం’’ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంచి కవిత్వం శీర్షికన 30 మంది కవులు, కవయిత్రులు తమ కవితలను వినిపించారు.
కార్యక్రమంలో నరాల సుధాకర్, తిరుమల శ్రీనివాస్ ఆర్య, డాక్టర్ కాసర్ల నరేష్ రావు, కంకణాల రాజేశ్వర్, అన్యం పద్మజా రెడ్డి, రేణుక, మఠం సుజాత, దారం గంగాధర్, తొగర్ల సురేష్, దైవసాని కైలాస్, నాగం సాయిలు, పురం శంకర్, వేణుగోపాల్, ప్రవీణ్, తెలంగాణ ఉద్యమకారుడు నజీర్, తదితరులు పాల్గొన్నారు.