ప్రజావాణి ప్రారంభం

హైదరాబాద్‌, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని గురువారం ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డి వెల్లడిరచారు.

ఎన్నికల కోడ్‌ ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో ప్రతి వారం మంగళ, శుక్ర వారాల్లో కొనసాగుతుందని చిన్నారెడ్డి వివరించారు.

ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజా వాణిలో అందజేయాలని చిన్నారెడ్డి కోరారు. ప్రజావాణి స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌గా రాష్ట్ర మున్సిపల్‌ డైరెక్టర్‌ దివ్య వ్యవహరిస్తున్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »