నిజామాబాద్, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రగతిశీల మహిళా సంఘం (పివోడబ్ల్యు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టు బస్సులను ఏర్పాటు చేయాలని, కులాస్పూర్ గ్రామానికి బస్సులను పంపాలని డిమాండ్ చేస్తూ, ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే. సంధ్యారాణి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కానీ అనేక రకాలుగా ప్రయాణికులకు బస్సులో సీట్లు దొరకగా కష్టాలు పడుతున్నారన్నారు.
అదేవిధంగా అనేక గ్రామాలకు ఇప్పటివరకు బస్సు సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. కులాస్పూర్ గ్రామానికి మోపాల్, డిచ్పల్లి వైపు నుండి బస్సు సౌకర్యం కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. మహిళలకు ప్రయాణికులకు, వారి సంఖ్యకు తగిన విధంగా బస్సు సౌకర్యాలను కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తారు. లేనిపక్షంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తారని అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శకుంతల, సహాయ కార్యదర్శి గౌరక్క, జిల్లా నాయకులు లలిత ,అమూల్య, భాగ్య, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.