వాయిదా పడిన డిగ్రీ, బి.ఎడ్‌., పీజీ పరీక్షల రివైస్డ్‌ షెడ్యూల్‌ విడుదల

డిచ్‌పల్లి, జూలై 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో జరుగుతున్న పీజీ పరీక్షలు మరియు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ, బి.ఎడ్‌. పరీక్షలు 22, 23, 24 జూలై 2021 తేదీలలో జరిగే వాటిని వాయిదా వేస్తునట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఆటంకం కలుగుతుందని విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి వినతులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కంట్రోలర్‌ అన్నారు.

కాగా వాయిదా పడిన పరీక్షలను తిరిగి నిర్వహించతలపెడుతూ కంట్రోలర్‌ రివైస్డ్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. దీని ప్రకారం డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌, రెండవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 26 తేదీ నుంచి ఆగస్ట్‌ 4 వ తేదీ వరకు, బి.ఎడ్‌. నాలుగవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌/ బ్యాక్‌ లాగ్‌ / ఇంఫ్రూవ్‌ మెంట్‌, రెండవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ / ఇంఫ్రూవ్‌ మెంట్‌ థియరీ పరీక్షలు ఈ నెల 26 నుంచి 30 వ తేదీ వరకు, పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌.ఎల్‌.బి., ఎల్‌.ఎల్‌.ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూలర్‌ పరీక్షలు ఈ నెల 31 నుంచి ఆగస్ట్‌ 6 వ తేదీ వరకు జరుగుతాయన్నారు.

డిగ్రీ, బి.ఎడ్‌., పీజీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాలలో కొవిద్‌ – 19 నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్‌ ధరించడం, ఎవరికి వారే శానిటైజర్‌, వాటర్‌ బాటిల్‌ వంటివి వెంట తెచ్చుకోవాలని ఆదేశించారు. 6 అడుగుల భౌతిక దూరం నియమంతో మెలగాలని సూచించారు. అర్థగంట ముందుగానే పరీక్షాకేంద్రానికి హాజరు కావాలని ఆజ్ఞాపించారు. ఆలస్యమైన విద్యార్థులను ఎట్టి పరిస్థితిలో పరీక్షాకేంద్రంలోకి ప్రవేశం కల్పించబోమని పేర్కొన్నారు.

కావున డిగ్రీ, బి. ఎడ్‌., పీజీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ను సంప్రదించాలన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »