మోర్తాడ్, జూలై 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని ముసలమ్మ చెరువు నిండుకుండలా నిండి అలుగు పారుతుంది. ఆర్మూరు సబ్ డివిజన్‌లోని గ్రామాలలో గల అతి పెద్ద చెరువు అయిన ముసలమ్మ చెరువు గత కొన్ని సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో వర్షాలు కురవక ఇప్పటివరకు చెరువు అలుగు పారలేదు. గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువు నిండుకుండలా నిండి అలుగు పారుతుంది.
దీంతో అలుగు పారే నీటికి క్రిందిభాగంలో గల వాగుకు రెండు దిక్కుల గల పంట పొలాలు నీట మునిగిపోయాయి. వరి నాట్లు వేసిన పంట పొలాలు నీట మునగడం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని అంటున్నారు.
ఏది ఏమైనా గ్రామంలోని ముసలమ్మ చెరువు నిండు కుండల నిండి వాగులు వర్రెలు పొంగి వరదలు పారడం వల్ల గ్రామంలోని పంట పొలాల్లో, బోరు బావుల్లో నీరు పుష్కలంగా చేరి నిల్వ ఉంటుందని తద్వారా పంటలు పుష్కలంగా పండే అవకాశం ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.