ఆర్మూర్, జూన్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూరు పట్టణం లో ప్రముఖ పాఠశాల అయిన శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో బుదవారం గాయత్రి హోమం నిర్వహించారు. పాఠశాల పునః ప్రారంభం అవ్వడం వల్ల విద్యార్థులకు మంచి విద్యా బుద్దులు రావాలని ఒక మంచి నడవడిక విద్యార్థులలో మెదలాలని మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతి విద్యార్థికి తెలియాలని ఒక సదుద్దేశ్యంతో గాయత్రి యజ్ఞం చేయించడం జరిగినదని పాఠశాల యాజమాన్యం వివరించింది.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రవినాథ్, ఇందూరు విభాగ్ శైక్షనిక్ ప్రముఖ్ పక్కి శ్రీనివాస్, పాఠశాల ప్రభంధ కారిణి కమిటీ అధ్యక్షులు వంశీ కృష్ణ, ఉపాధ్యక్షులు జనార్ధన్ కిరణ్, రవికాంత్, రాం కిషోర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముద్రకోల వినోద్ కుమార్, మేనేజ్మెంట్ గుద్దేటి భాను తేజ, అభిమన్యు, అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.