కామరెడ్డి, జూన్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్. రవీందర్ రాజు ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది బుధవారం మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఇట్టి దాడుల్లో సోమరం పేటకు చెందిన చిట్టవేని నర్సయ్య ఇంట్లో 3 లీటర్ల నాటుసారా లభ్యమైంది.
అతన్ని విచారించగా సోమరంపేటకు చెందిన మాలోత్ వీణ దగ్గర తీసుకున్నట్టు తెలిపాడు. మాలోత్ వీణ ఇంట్లో సోదాలు నిర్వహించగా అక్కడ 5 లీటర్ల నాటు సారా లభ్యమైంది. ఆమె నాటు సారా తయారీకి బెల్లం గుగులోత్ దేవేందర్ దగ్గర కొనుగోలు చేసినట్టు తెలిపింది. ఈ ముగ్గురి పై కేసులు నమోదు చేశారు.
అలాగే గతంలో బైండ్ ఓవర్ అయినా కూడా మళ్లీ నాటు సారా తయారీ చేసిన నెమలి గుట్ట తండాకు చెందిన మలోత్ సునీతపై బైండ్ ఓవర్ ఉల్లంఘించిన కారణంగా జరిమానా విధించినట్టు తెలిపారు. నాటు సారా తయారీ చేసినా అమ్మినా వాటి తయారీకి ముడి సరుకు అందించినా కూడా కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ సిఐ విజయకుమార్ తెలిపారు. దాడుల్లో ఎస్‌ఐ విక్రమ్, సిబ్బంది సిద్ది రాములు, ఆంజనేయులు, రమ, శ్రీ రాగ పాల్గొన్నారు.