కామారెడ్డి, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామరెడ్డి జిల్లాకు సాగు నీరు అందించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 20,21,22 ప్యాకేజీ పెండిరగ్ పనులపై ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం హర్షణీయమని మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా రైతులకు రెండు లక్షల 75,000 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్సార్ హయాంలో ప్రారంభించిన పనులు బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20.21.22 ప్యాకేజి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితే షబ్బీర్ అలీకి, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని ప్రాజెక్టు పూర్తి కాకుండా పదేళ్ల పాటు కక్ష కట్టి నిధులు ఆపేశారన్నారు.
పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే షబ్బీర్ అలీ కలలు కన్న 20,21,22 ప్యాకేజి పనులు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పట్టుదలతో పూర్తి చేయించడమే లక్ష్యంగా ఇరిగేషన్ అధికారులతో పనుల పురోగతి తెలుసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టు ప్యాకేజీ పనుల కోసం అవసరమయ్యే నిధులను మంజూరు చేయిస్తానని పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తాననడం జిల్లా రైతాంగానికి తీపి కబురు అందించారన్నారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 20,21,22 ప్యాకేజి పనులను పూర్తి చేసి జిల్లా రైతులకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించడం పట్ల ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయని జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని అ ఘనత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకే దక్కుతుందని యావత్ జిల్లా రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.