పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశభవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది

కామారెడ్డి, జూన్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

పరిశుభ్రత పాటించడంవల్ల రోగాల బారి నుండి రక్షించుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. 14వ జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక ముదాంపల్లిలోని జిల్లా పరిషద్‌ బాలికల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినికులకు ఆల్బెండజోల్‌ మాత్రలు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడుపులో నట్టలు ఉన్నట్లయితే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం ,కడుపునొప్పి వంటి వాటితో బాధపడతారని అన్నారు.

పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశభవిశ్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, ఆ దిశగా ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి, జూన్‌ మాసాలలో రెండు పర్యాయాలు ఆల్బెండజోల్‌ మాత్రలు ఇస్తున్నదని అన్నారు.ఈ మాత్రలు వేసుకోవడం వళ్ళ కడుపులో పురుగులు నట్టలు నశిస్తాయని, అనీమియాను నియంత్రించవచ్చని, పిల్లలు నశించి ఆరోగ్యవంతంగా పెరుగుతారని అన్నారు. జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల లోపు 2,50,254 పిల్లలున్నారని గుర్తించడం జరిగిందని, వారికి వంద శాతం మాత్రలు అందించేలా కార్యాచరణ రూపొందించి నేడు మాత్రలు అందిస్తున్నామని, ఏదేని కారణం చేత ఈ రోజు మాత్రలు వేసుకొని వారికి తిరిగి ఈ నెల 20 న ఆల్బెండజోళ్‌ మాత్రలు వేయించి వంద శాతం లక్ష్యం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుండి వచ్చిన వారికి సైతం ఆల్బెండజోల్‌ మాత్రలు పిల్లలకు వేయించాలని, ఎట్టి పరిస్థితులలో మాత్రలు ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతించకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం అందించే ఆల్బెండజోళ్‌ మాత్రలు చాలా శ్రేష్ఠమైనవని, ఎలాంటి సైడ్‌ ఎఫక్టులు, ఇన్ఫెక్షన్‌ లు రాకుండా ఈ మాత్ర పనిచేస్తుందని అన్నారు.

అమ్మ ఆదర్శ పాఠాశాలల క్రింద చేపట్టిన టాయిలెట్‌ బ్లాక్స్‌, మంచినీటి ట్యాంక్‌, కుళాయిలు, తరగతి గదులలో లైట్లు, ఫాన్స్‌ ఏర్పాటు, కిటికీల మరమ్మత్తులు పనుల ప్రగతిని పరిశీలించి ప్రధానోపాధ్యాయులు, మహిళా సమాఖ్య సభ్యురాలిని వివరాలడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతూ ఉచిత పాఠ్య పుస్త్తకాలు, ఏక రూప దుస్తులు అందిస్తున్న ఒక్క రూపాయి ఖర్చుకాకుండా శిక్షితులైన అధ్యాపకులచే బోధన గావిస్తున్నామని, విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్‌ కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ ఇందు ప్రియ మాట్లాడుతూ శుభ్రత పాటించకుండా చేతులు నోట్లో పెట్టు కోవడం, గోళ్లు గిలుకోవడం, పాదరక్షలు లేకుండా మట్టిలో ఆదుకోవడం వళ్ళ కడుపులో పురుగులు పడే అవకాశముందని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ పాఠశాల పదవ తరగతిలో మంచి ఉతీర్ణత ఫలితాలు సాదించడంపట్ల సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థినులు లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కృషిచేయాలని తమ వంతు సహకారమందిస్తామన్నారు.

కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ వనిత, వార్డు కౌన్సిలర్‌ ప్రముఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్‌, డీఈఓ రాజు, ఎంఈఓ ఎల్లయ్య, ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »