డిచ్పల్లి, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి ఆదేశానుసారం ఓల్డ్ బాయ్స్, న్యూ బాయ్స్, మరియు గర్ల్స్ హాస్టల్స్‌ను చీఫ్ వార్డెన్, వార్డెన్ తనిఖీ చేశారు.
హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్, మెస్ కమిటీ మెంబర్స్‌తో మీటింగ్ పెట్టి పరిసరాల పరిశుభ్రతతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రాసరి కోసం గతంలో వాడుతున్న సరుకుల దుకాణదారిని మార్చి కొత్త దుకాణదారుని నియమించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని తాజా సరుకులను వంటకు వినియోగించాలని వర్కర్స్ అప్రమత్తంగా లేనట్లయితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.