కామారెడ్డి, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణిలో వివిధ మండలాలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా మండల అధికారులు, డివిజనల్ అధికారుల నుండి దృశ్య మాధ్యమం ద్వారా తక్షణ పరిష్కారాన్ని మార్గం సుగమం చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్కు నేరుగా వినతులు అందిస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మకంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలతో కలెక్టరేట్ కిటకిట లాడిరది.
మొదటిసారిగా ఫిర్యాదును ఆన్ లైన్లో నమోదు చేసుకుని నెంబరు ఇచ్చిన మీదటే ఫిర్యాదీదారులు తమ వినతులను కలెక్టర్ కు అందజేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ 105 వినతులను స్వీకరించారు. ప్రధానంగా విద్య,వైద్య, బిసి,గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ, పింఛన్లు, ఆపద్బాందు , మున్సిపాలిటీ, ధరణి, మైన్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తదితర అంశాలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి. అట్టి ఫిర్యాదులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ పరిష్కరించవలసినదిగా ఆదేశించారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వినతులను దృశ్య మాధ్యమం ద్వారా స ఫిర్యాదీదారుని సమస్యను వివరిస్తూ పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకసారి సమస్య పరిష్కార నిమిత్తం వచ్చిన ఫిర్యాదీదారుడు తిరిగి మరల రాకూడని విధంగా పరిష్కారము లేదా సహేతుక కారణం తెలపాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సంగ్వాన్ మాట్లాడుతూ ప్రజావాణిలో ఇప్పటి వరకు 4,300 వినతులు పెండిరగు ఉన్నాయని, అందులో కొన్ని ఓపరిష్కరించినా ఆన్ లైన్ లో అప్డేట్ చేయకపోవడం వల్ల పెండిరగ్ కనిపిస్తున్నాయని అన్నారు. అందరు అధికారులకు లాగిన్,పాస్వర్డ్ లు అందించామని, ప్రజావాణితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ క్షుణ్ణంగా పరిశించి పరిష్కరింపదగినవి వెంటనే పరిశీలించాలని, లేని వాటికి తగు ప్రత్యామ్నాయ మార్గం ఫిర్యాదీదారునికి తెలపాలన్నారు. ఫిర్యాదులపై నేటి నుండి ప్రత్యేక దృష్టిపెట్టి మండల స్థాయి తహసీల్ధార్లు రోజు 25 నుండి 30, ఆర్డీఓ లు రోజు వంద చొప్పున ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. మిషన్ భగీరథ నీటి కుళాయిల సర్వే సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అంతకుముందు ఉదయం ఆర్డీఓ లు, తహసీల్ధార్లతో ప్రజావాణి అర్థవంతంగా నిర్వహించుటపై కలెక్టర్ జూమ్ మీటింగ్ ద్వారా దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డిఓ చందర్, డిపిఓ శ్రీనివాసరావు, సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.