ఎప్పటికీ మర్చిపోము… ఎప్పటికీ క్షమించం…

కామారెడ్డి, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వీరులను, ఉద్యమకారులను స్మరించుకున్నారు. 1977 మార్చి 21వరకు ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేసి ప్రతికలను సెన్సార్‌ చేశారన్నారు. వాస్తవాలను చెప్పేందుకు ప్రయత్నించిన పత్రికలపై తీవ్ర నిర్బంధం విధించారని, ప్రశ్నించే మేధావులు, పాత్రికేయుల గొంతునొక్కారని, ఎన్నో సంస్థలను రద్దు చేశారని విమర్శించారు.

భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే 1975 జూన్‌ 25న ఒక ‘చీకటి రోజు’గా నిలిచిపోయింది. ఇదే రోజున నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో అంతర్గత అస్థిరతను, అశాంతిని కారణంగా చూపుతూ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కారు. ఇదే రోజున ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు హేమాహేమీ నాయకులైన అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మొరార్జీ దేశాయ్‌, బిజూ పట్నాయక్‌, చంద్రశేఖర్‌ లాంటి మరెందరో ప్రముఖులతో సహా లక్ష మందికి పైగా ప్రజలను నిర్బంధించి జైళ్లలో పెట్టారు.

అంతేకాకుండా ఎన్నికలు వాయిదా వేయడం, ప్రభుత్వ వ్యతిరేక నిరసననలను ఉక్కుపాదంతో అణచివేయడం, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని చట్టాలను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చడం జరిగింది. ‘ఎమర్జెన్సీ’ అంటే ఇందిరా గాంధీకి ఒక పర్యాయపదంగా మారిపోయింది. 1975 జూన్‌ 25న విధించిన ఎమర్జెన్సీ 1977 మార్చ్‌ 21 వరకు అంటే 21 నెలల పాటు అమలులో ఉంది. నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ ఆలీ అహ్మద్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 352 ప్రకారం దేశంలో అంతర్గత అశాంతిని కారణంగా ఉటంకిస్తూ అధికారికంగా ఎమర్జెన్సీని జారీ చేశారని కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు.

Check Also

ఘనంగా బాబూ జగ్జీవన్‌ రాం జయంతి వేడుకలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »