హైదరాబాద్, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆదిలాబాద్ మాజీ ఎంపీ, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రమేష్ రాథోడ్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఆయన తన ప్రత్యేక ముద్ర వేశారని, తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.