నిజామాబాద్, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ న్యాయవాదులు బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా నగరంలో తిలక్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజరెడ్డి మాట్లాడుతూ స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటిన తిలక్ మార్గాలు నేటి యువత పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎంతో మంది స్వాతంత్ర యోధులు పోరాడారని, ఇలాంటి వారి నుండి ప్రేరణ పొంది, ఆర్థిక సామాజిక రంగాలలో అసమానతలను రూపుమాపాలని రాజారెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో న్యాయవాదులు జగన్ మోహన్ గౌడ్ , రాజ్ కుమార్, సుబేదార్ బండారి క ృష?మోహన్, వెంకటేష్, శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, నారాయణ దాసు, గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు