బాన్సువాడ, జూలై 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులు కేక్ కట్ చేసి ఘనంగా డాక్టర్స్ డే ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ ను ఉద్యోగులు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వైద్య వృత్తి ఎంతో కీలకమని, ప్రజలు వైద్యులను దేవుడిగా భావిస్తారని, వైద్యులను సత్కరించుకోవడం వారు చేస్తున్న సేవలకు మనం అభినందించడం అవుతుందన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్యులను ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస ప్రసాద్, డాక్టర్లు నరసింహ చారి, సుధా, శిరీష, వైద్యులు,నర్సులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.