బాన్సువాడ, జూలై 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను బాన్సువాడ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. సోమవారం బాన్సువాడ డిఎస్పి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలో ఒక వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో సమీపంలోని సీమల శ్రీకాంత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతని వద్ద 120 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు పైన తెలిపారు.
యువకుడిని పూర్తిస్థాయిలో విచారించగా బోధన్ పట్టణంలోని రాకాసిపేట చెందిన నస్రిన్ బేగం అనే మహిళ దగ్గర గంజాయిని కొనుగోలు చేసినట్లు అంగీకరించడంతో, వెంటనే పోలీసులు బోధన్ నిర్వహించగా ఆమె వద్ద 500 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు తెలిపారు. ఆమెతోపాటు రషీద్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా మహారాష్ట్రలోని నయగావ్ అనే ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు రషీద్ అంగీకరించడంతో శ్రీకాంత్, నస్రిన్ బేగం, రషీద్‌లను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు అయిన తెలిపారు.
గంజాయి కేసును చాకచక్యంగా చేదించి నిందితులను అరెస్టు చేసిన పట్టణ సిఐ కృష్ణ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై జగన్నాథం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.