బాన్సువాడ, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్సై మోహన్ అన్నారు. బాన్సువాడ పట్టణ శివారులోని కోయ్యగుట్ట చౌరస్తాలో గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు వాహనాలకు సంబంధించిన ద్రువ పత్రాలు వెంట ఉంచుకోవాలని, తనిఖీ సమయంలో పోలీసులకు సహకరించాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయబడతాయన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ అమృ, కానిస్టేబుల్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.