ప్రజలు జలాశయాల వద్దకు వెళ్ళద్దు….

వేల్పూర్‌, జూలై 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చెక్‌ డ్యాములు, చెరువులు పరిశీలించారు. మోతే గ్రామంలో పెద్ద చెరువు కాలువ తూము వద్ద పూజలు చేశారు. మోతే గ్రామంలో కప్పల వాగుపై గల లెవెల్‌ వంతెన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు చెరువులు వాగులు వంకలు నిండిపోయి నీరు పొంగి ప్రవహిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ప్రజలు వాగుల వద్ద చెరువుల వద్ద చెక్‌ డ్యామ్‌ వద్దకు వెళ్లవద్దని సూచించారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏమైనా సమస్య వస్తే పరిష్కరించే విధంగా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ఎవరు కూడా బయటకు రావద్దని వచ్చినట్లయితే తొందరగా పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోవాలని తెలిపారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »