కామారెడ్డి, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన, వసతి సౌకర్యాలు అందించాలని, నిరంతర హైజీన్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం పట్టణంలోని తెలంగాణ సాంఫీుక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల (లింగంపేట్) ను కలెక్టర్ తనిఖీ చేసారు. గురుకులంలోని తరగతి గదులు, డార్మెటరీ, వంటశాల, స్టోర్ రూంలను పరిశీలించారు.
విద్యార్థినులతో మాట్లాడుతూ, మంచి విద్యను అభ్యసించాలి, ట్రిపుల్ ఐటి లో సీట్ సాధించే విధంగా విద్య ను అభ్యసించాలి అన్నారు. భోజనం ఎలా వుంది, విద్య బోధన ఎలా వుంది అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
అనుమతి లేకుండా విద్యార్థినులు బయటకు వెళ్తున్నారా అని అడిగారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రంగనాథ రావు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిని రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, ప్రిన్సిపాల్ డా. వనిత, తహసీల్దార్ జనార్ధన్, తదితరులు ఉన్నారు.