కామారెడ్డి, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న మంజుల (28) కి అత్యవసరంగా ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మెదక్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు సహాయ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ శర్మ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవా రాష్ట్ర చైర్మన్ రెడ్క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ సహాయ ఆచార్యులుగా విధులను నిర్వహిస్తూనే గతంలో కూడా గర్భిణీ స్త్రీల కోసం, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి కోసం రక్తాన్ని ఇస్తూ ఆదర్శంగా వేణుగోపాల్ శర్మ నిలవడం జరిగిందని వీరికి ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నల తరఫున అభినందనలు తెలిపారు.