కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంల తరలింపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎంల తరలింపు జరిగింది. పోలీసు బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో 78 బ్యాలెట్‌ యూనిట్లు, రెండు కంట్రోల్‌ యూనిట్లను బీ.ఈ.ఎల్‌ కు తరలించారు.

ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా ఈ.సీ సూచనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ఈవీఎంలను తరలించారు. ఈ ప్రక్రియలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్‌, సాత్విక్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »