బాన్సువాడ, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని ఎస్ఎస్ఎల్ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో గురువారం విద్యార్థులకు మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే పరిణామాలపై మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండే తమ లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు కావడం వల్ల తమ కుటుంబం తల్లిదండ్రులు పడే బాధను అర్థం చేసుకొని తమ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే శక్తి వారి చేతుల్లోనే ఉంటుందన్నారు. క్షణిక ఆవేశాలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా పిల్లలపై పడుతుందన్నారు.
డ్రగ్స్ కల్తీ కల్లు, గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకుడు బెజుగాం సత్యనారాయణ, ఏఎస్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యల సంతోష్, జీవన్ రావు, అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.