నందిపేట్, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నందిపేట్ మండల కేంద్రంలో గల ఊర చెరువు లో గణేష్ విగ్రహాల ఇనుప స్టాండ్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పత్రి కనకయ్య మృతి చెందాడని ఎస్ ఐ. హరిబాబు తెలిపారు. నిన్న ఉదయం పనికి వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుండి పోయాడని రాత్రి అయిన తిరిగి రాలేదని మృతిని భార్య యాసిన్ తెలిపినట్లు ఎస్. ఐ చెప్పారు.
చెరువులో మృతుడి శవాన్ని కొందరు చూసి సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొన్నట్లు ఆయన చెప్పారు.