బాన్సువాడ, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయా లోక్ ఆదాలత్ కార్యక్రమంలో జడ్జి టిఎస్పి భార్గవి ఆధ్వర్యంలో 93 కేసులు పరిష్కారమయ్యాయని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, క్షణిక ఆవేశంలో జరిగే గొడవలు, హత్యలవల్ల తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు.
ప్రతి ఒక్కరూ కేసుల వల్ల డబ్బుతో పాటు సమయాన్ని వృధా చేసుకుంటున్నారని, కోర్టు పరిధిలో మండల న్యాయ సేవ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, రూరల్ సిఐ సత్యనారాయణ గౌడ్, పట్టణ సిఐ మండల అశోక్, బారాసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణమూర్తి, న్యాయవాదులు ఖలీల్, మోహన్ రెడ్డి, మొగులయ్య, అయ్యాలా ఆనంద్, బాలరాజు, ఎస్సైలు రాజు, రాజశేఖర్, కోర్టు సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.