నందిపేట్, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు డిపో నిర్మించుకుంటే పోరాటం ఉదృతం చేస్తామని జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివారం డిమాండ్ చేసింది.
నందిపేట్లో బస్సు డిపో నిర్మిస్తామని అవసరమైన స్థలం ఇప్పించాలని ఉమ్మడి మండల నాయకులను కోరారని జే ఏ సి. తెలిపింది. ఆసమయంలో రేషన్ కార్డుకు ఐదు రూపాయల చొప్పున వసూలు చేసి బస్సు స్టాండ్ ప్రక్కనే ఐదు ఎకరాల భూమి కొని ఆర్టీసీ పేరున రిజిస్టర్ చేసి ఇచ్చామని కమిటీ తెలిపింది. అప్పటి రవాణ శాఖ మంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేకర్ రావు శిలాఫలకం వేశారని, ఆయన పది సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్న పట్టించుకోలేదని జే ఏ సి సభ్యులు తిలక్, గిరి, నాందేవగౌడ్, జ్యోతి నారాయణ లు బాధను వ్యక్తం చేసారు.
ప్రస్తుతం నందిపేట్ మండలం చుట్టు నిజామాబాద్, ఆర్మూర్, మహారాష్ట్రలోని లోకేశ్వరం, బైంస వేళే రోడ్డు మార్గాలు, సంభందాలు, వ్యాపార లావాదేవీలు పెరిగాయని వారు అన్నారు. ఉద్యోగులకు, విద్యార్థులకు బస్సు లు సకాలంలో అందుబాటులో ఉండక ఇబ్బంది పడుతున్నారని కనుక వెంటనే బస్సు డిపో నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేసారు. లేకుంటే ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేపడతామని ఆర్టీసీని హచ్చరించారు.