నిజాంసాగర్, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని ప్రాజెక్ట్ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్ట్ జలాశయంలోనికి వరద నీరు వచ్చి చేరడంతో సింగీతం ప్రాజెక్ట్ జలాశయం పూర్తిస్థాయిలో నిండిరదని ఏఈ శివప్రసాద్ శనివారం తెలిపారు.
ప్రాజెక్ట్ ఎగువ భాగంలో గల గండివేట్, పెద్దగుట్ట, కోనాపూర్, గౌరారం తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్ట్ 3 వరద గేట్లను ఎత్తి నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం 1174 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని తెలిపారు. అలుగు పైనుంచి 749 క్యూసెక్కుల నీరు వెళ్తున్నదని, 3 వరద గేట్లు ద్వారా 425 క్యూసెక్కుల ప్రధాన కాలువలోకి విడుదల చేయడం జరుగుతుందన్నారు.