నిజామాబాద్, అక్టోబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారత స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధామంత్రి, భారత రత్న లాల్ బహుదూర్ శాస్త్రీ లకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలోని గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీల విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వలసపాలకు వ్యతిరేకంగా అహింసాయుత ఉద్యమం నడిపి ప్రపంచ దేశాలకు గాంధీ మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడారు.
దేశ స్వాతంత్రం కోసం ఎన్నో ఉద్యమాలు నిర్మించి, దేశానికి స్వాతంత్య్రం సిద్దించిన అనంతరకాలంలో భారతదేశ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రీ దేశ ప్రగతినిర్మాణానికి నూతన ఒరవడులు తీర్చిదిద్దారని జైజవాన్ జై కిసాన్ అనే నినాధం దేశ ప్రజల అభివృద్ధి చెంది పనిచేశారని కొనియాడారు.
కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, ప్రభుత్వ న్యాయవాది వెంకట రమణ గౌడ్, న్యాయవాదులు మానిక్ రాజు, ఆశా నారాయణ, లక్మి నారాయణ, సురేష్ బొల్లివార్ తదితరులు న్యాయవాదులు పాల్గొన్నారు.