నిజాంసాగర్, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని కల్యాణి ప్రాజెక్టులోకి రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి 275 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో 1 వరద గేట్ల ద్వారా 125 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరాలోకి విడుదల చేయడం జరుగుతుందన్నారు. అలాగే 150 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ వైపు మళ్ళించడం జరుగుతుందని ఏ.ఈ. శివ ప్రసాద్ తెలిపారు.
కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్ల కాగా 408 .70 మీటర్ల నీటిని నిలువ ఉంచుతూ అదనంగా వస్తున్న నీటిని ప్రధాన కాలువ వైపు మళ్ళించడం జరుగుతుందని తెలిపారు. వర్ష ప్రభావం పెరిగే అవకాశం ఉంటే ఇంకా గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తామన్నారు.