కామారెడ్డి, అక్టోబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుచున్నదని, ప్రతీ క్రీడాకారుడు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సిరిసిల్ల ఒ.ఆర్.ఆర్. రోడ్డులో శనివారం రోజున జిల్లాకు చేరుకున్న సి. ఎం. కప్ కు స్వాగతం పలికారు, జెండా ఊపి రన్ ను ప్రారంభించారు.
క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, గ్రామ స్థాయికి క్రీడలను తీసుకువెళ్ళడానికి రాష్ట్ర వ్యాప్తంగా సి. ఎం. కప్ ను గ్రామం, మండలం, జిల్లాల్లో వివిధ విభాగాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుచున్నది. జిల్లాలో 48 కి.మీ. సాగుతుందని, ఓ.ఆర్.ఆర్. సిరిసిల్ల రోడ్ నుండి కామారెడ్డి బస్ స్టాండ్ వరకు 10 కి.మీ. రన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో దాదాపు 100 మంది క్రీడాకారులు, ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్.క్యాడేట్ లు పలువురు అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, డి.ఎస్. పి. రాజేశ్వర్ రావు, జిల్లా యువజన సంక్షేమ అధికారి జగన్నాథన్, మున్సిపల్ కమిషనర్ సుజాత, తదితరులు పాల్గొన్నారు.