నందిపేట్, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టరుగా నందిపేట్ మండలం లోని కంటం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు పెంట ఇంద్రుడు పదవి బాధ్యతలు, ప్రమాణస్వీకారం చేసారు.
కాంగ్రేస్ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి పాటుపడుతుందని ఇంద్రుడు అన్నారు. రైతులు పండిరచిన పంటలకు మార్కెట్ కమిటీ ద్వార మంచి రేటు వచ్చేలా కృషి చేస్తానని, అందరికి అందుబాటులో ఉంటానని చెప్పారు.