బాన్సువాడ, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ డివిజన్లోని 108, 102 అంబులెన్స్ వాహనాల ద్వారా సేవలు అందిస్తున్న తీరును మంగళవారం ప్రోగ్రాం మేనేజర్ మధు కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబులెన్స్ లో ప్రధమ చికిత్స అందించడానికి ఉండాల్సిన పరికరాలను, రోగులకు తక్షణ వైద్య సాయం కోసం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పలు సూచనలు తెలిపారు.
కార్యక్రమంలో ఈఎంటి ప్రసాద్, లక్ష్మణ్, సంగాగౌడ్, రాము, శ్రీనివాస్ గౌడ్, తేజ, డివిజన్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.