కామారెడ్డి, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ మహిళలకు బతుకమ్మ గొప్ప పండుగ అని, మహిళల ఐక్యతకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం ఐ.డి.ఒ.సి. లో జనహిత వారి సౌజన్యంతో తెలంగాణ జె.ఎ.సి. ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రసంగిస్తూ, మహిళా ఉద్యోగుల కోసం బతుకమ్మ వేడుకలను నిర్వహించడం అభినంద నీయమన్నారు.
బతుకమ్మ వేడుకలు, దసరా పండుగ సందర్భంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం టిజివో, టిఎన్జివో లకు అభినందనీయమన్నారు. పలు శాఖల మహిళా ఉద్యోగినులు పాల్గొనడం జరిగిందన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో సంప్రదాయంగా బతుకమ్మ పండుగలను మహిళలు నిర్వహించుకుంటారని తెలిపారు. మొదటి మూడు ఉత్తమ బతుకమ్మ లకు బహుమతులను కలెక్టర్ ప్రదానం చేసారు. మొదటి బహుమతి ఐసీడీఎస్ శాఖకు అందించారు.
కార్యక్రమంలో టిఎన్జివో అధ్యక్షులు ఎన్.వెంకట్ రెడ్డి, టిఎన్జివో అధ్యక్షులు డా. ఆర్. దేవేందర్, సెక్రటరీ సాయి రెడ్డి, టీజివో నాయకులు సంతోష్, శివకుమార్, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.