నందిపేట్, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నందిపేట్ మండలంలో మధ్యాహ్నం భారీ వర్షం పడిరది. దీనితో ఆదివారం దుర్గా మాత విగ్రహ నిమర్జనం కు ఆటంకం ఎదురైంది. రైతులు కోసిన వరిధాన్యం తడిసిపోయింది. ఎంతో కస్టపడి ఎండబెట్టిన వరి ధాన్యం నీళ్లలో పోసిన పన్నీరులా తయారైంది.
సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరిస్తే సమస్య ఉండేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన వరి ధాన్యంను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.