నిజామాబాద్, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బోధన్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మాజీ సభ్యుడు గాదే సత్యనారాయణ మూర్తి మృతి చాలా బాధాకరమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. న్యాయవాదిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాక్టీస్ చేస్తు న్యాయసేవలు అందించారని కొనియాడారు.
మూర్తి మృతికి సంతాప సూచకంగా బార్ సమావేశపు హల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు సంఘచాలక్‌గా హిందు సమాజ శ్రేయస్సుకు అవిరల కృషి చేశారని తెలిపారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యునిగా న్యాయవాద సమాజానికి అండదండలు అందించారని అన్నారు.
1964 లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుని సుదీర్ఘ న్యాయప్రస్థానం చేసిన మూర్తి కీర్తి అజరామరమని గౌడ్ పేర్కొన్నారు. మూర్తి మృతికి సంతాపం వ్యక్తం చేస్తు తీర్మానం ఆమోదించినట్లు, సోమవారం కోర్టులలో విధులకు దూరంగా ఉన్నట్లు తెలిపారు.
సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి, బార్ ఉపాధ్యక్షుడు రాజు,ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, కార్యదర్శి సురేష్ దొన్పల్, కోశాధికారి దీపక్, సీనియర్ న్యాయవాదులు సంగమేశ్వర్ రావు, కృపాకర్ రెడ్డి, ఆకుల రమేశ్, మానిక్ రాజు, మధుసూదన్ రావు అముదాల సుదర్శన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.