ఆర్మూర్, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఆలూర్ రోడ్లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పియూసి చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పురపాలక, ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములై మొక్కలు నాటాలని అన్నారు. దేవుని ఆశీస్సులతో మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మునుముందు మంచి పదవులు పొందాలని ఆకాంక్షించారు.
ఐటీ శాఖను అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ముందుంచే విధంగా కేటీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం మొక్కలు నాటుతున్న కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో చైర్మన్ వినీత పవన్, వైస్ చైర్మన్ మున్ను, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు, అధికారులు, బల్దియా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు