కామారెడ్డి, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి 1 గంటల వరకు నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీని ఆహ్వానించడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తం దొరకకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారని వారి ఇబ్బందులను తొలగించడానికి ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని, యువత రక్తదానానికి ముందుకు రావాలని, రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. రక్తదానం చేయాలనుకున్న వారు 9492874006 నెంబర్ కి సంప్రదించాలని అన్నారు.
కార్యక్రమంలో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ నిర్వాహకులు కోటపాటి రత్నావళి, కామారెడ్డి రక్తదాతల సమూహ ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్, కామారెడ్డి జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పప్పుల రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.