బాన్సువాడ, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ సహకార సంఘం పరిధిలోని ఇబ్రహీంపేట్, పోచారం రాంపూర్ తండాల్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను వైస్ చైర్మన్ అంబర్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించాలని, దళారులకు అమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు.
కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు బండి సాయిలు యాదవ్, మోహన్ రెడ్డి, సాయి రెడ్డి, సంగయ్య, సాయవ్వ, హరి సింగ్, చందర్ నాయక్, మోహన్ నాయక్, సాయా బోయి, రైతులు తదితరులు పాల్గొన్నారు.