కామరెడ్డి, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో పాక్స్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, వర్షాలు కురుస్తున్నాయి ధాన్యం తడిసి పోకుండా టార్పాలిన్ సిద్ధంగా ఉంచుకోవాలని, ధాన్యం తూకం వేయడానికి వేయింగ్ మిషన్, గాని సంచులు, తదితర ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.
వరి పంటను రైతులు ఆర్బెట్టుకొని సెంటర్ కు తీసుకురావాలని తెలియజేయాలని సూచించారు. అలాగే ధాన్యం ను శుభ్రం చేసుకొని వ్వచ్చే విధంగా రైతులకు తెలియజేయాలని అన్నారు. ప్రతీ రైతుకు టోకెన్ జారీ చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన వరి నీ వెంటనే సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ప్రతీ సంచి పై సెంటర్ నెంబర్ , జిల్లా కోడ్ ను వేయాలని తెలిపారు. వరి ధాన్యం సేకరణ సజావుగా నిర్వహించాలని అన్నారు.
కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, పౌరసరఫరాల అధికారులు, జిల్లా సహకార అధికారి, గ్రామస్తులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.