బాన్సువాడ, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరిందని గత సంవత్సరం నూతన గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు గ్రంథాలయ నిర్మాణం చేపట్టకపోవడం పట్ల బిజెపి నాయకులు గురువారం సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయం తాత్కాలికంగా మినీ స్టేడియంలో నిర్వహించడం వల్ల గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం చొరవచూపి వెంటనే గ్రంధాలయ నిర్మాణం చేపట్టాలన్నారు.
కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు తూప్తి ప్రసాద్, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్,సీనియర్ నాయకులు కోణాల గంగారెడ్డి, అశ్విన్, అందే చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.