కామారెడ్డి, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రతీ ఉద్యోగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించికోవాలని, దైనందిన జీవితంలో ప్రతీ ఒక ఉద్యోగి తన ఆరోగ్య పరిరక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. జిల్లా అధికారుల సంక్షేమ సంఘం, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సంయుక్తంగా గురువారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిభిరం ను కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం కోసం ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అంతకుముందు పలు పరీక్షల నిర్వహణ కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో 370 మంది ఉద్యోగులు వివిధ పరీక్షలు నిర్వహించుకున్నారు. సి.బి.పి., ఎల్.ఎఫ్.టీ.,బ్లడ్ యూరియా, ఏ1సి, మొదలగు పరీక్షలు నిర్వహించుకున్నారు. ఇందులో కొంతమందికి శుక్రవారం డాక్టర్ల సూచన మేరకు లిపిడ్ ప్రొఫైల్, బి 12, థైరాయిడ్, తదితర పరీక్షలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్రశేఖర్ నేతృత్వంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, %ణూఔA% అధ్యక్షులు రాజారాం, కార్యదర్శి దయానంద్, టీ.ఎన్.జి. ఒ. అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులు భూమాన్న, టీ.జి. ఒ. అధ్యక్షులు దేవేందర్, కార్యదర్శి సాయిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.