బాన్సువాడ, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని హన్మజీపేట్ గ్రామంలో మంగళవారం ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపడానికి హక్కుల కోసం పిడికిలెత్తిన కొమురం భీం జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన గిరిజన నాయకుడు కొమురం భీం చేసిన సేవలు ఎనలేనివని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఉద్యమాన్ని నడిపారన్నారు. కొమురం భీం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరం నడవాలన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పోచారం, కాసుల
బోర్లం సొసైటీ పరిధిలోని అన్మాజీపేట్ గ్రామంలో వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తాము పండిరచిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు.
కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సంగ్రం నాయక్, మాజీ ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తా, మాజీ సొసైటీ చైర్మన్లు పిట్ల శ్రీధర్, గోపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు నర్సింలు, మాజీ ఎంపిటిసి జెట్టి హన్మండ్లు,రాజేశ్వర్ గౌడ్, ఆదివాసి నాయక్ పొడ్ సంఘ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.