కామారెడ్డి, అక్టోబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సొంత తమ్ముని హత్య చేసిన నిందితునికి ఐదు సంవత్సరాల జైలుశిక్ష పడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అలాగే నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ సింధుశర్మ అభినందించారు. వివరాల్లోకి వెళితే…
తేదీ 01.10.2022 నాడు అల్లం మధుకర్ తండ్రి సాయన్న, వయస్సు 50 సంవత్సరాలు, కులం ముదిరాజు, వృత్తి కూలి, నసురుల్లాబాద్ గ్రామం, అతని పెద్ద కుమారుడు అయిన ప్రభాకర్ మద్యానికి బానిసై చిన్న కుమారుడు అయిన శివకుమారు / మృతుడుని తరచూ డబ్బులు ఇవ్వమని గొడవ పడేవాడు. చిన్న కుమారుడు పైసలు ఇవ్వడం లేదని మనసులో పెట్టుకొని. చంపాలని ఉద్దేశంతో పెద్ద కుమారుడు ప్రభాకర్ / నిందితుడు శివ కుమార్‌ను కట్టేతో తలపై కన్నుపై కొట్టి చంపి పడేసినాడు అని ఫిర్యాది మేరకు నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
పరిశోధనలో భాగంగా మృతుని ఇంటి ప్రక్కన, గ్రామస్తులను, ఇతర గ్రామస్తులను విచారించి అల్లం ప్రభాకర్‌ను నేరస్తునిగా గుర్తించి అరెస్టు చేశారు. ఈ విషయములో నేరస్తుడిపై కోర్టులో అభియోగ పత్రం వేశారు. కేసులో సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగినదని న్యాయమూర్తి కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ నిందుతునికి ఐదు సంవత్సరాల కఠిన గారాగార శిక్ష, రూ. 5 వేలు జరిమాన విధిస్తూ తీర్పు ఇచ్చినట్టు తెలిపారు.
పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీ దామోదర్ రెడ్డి, ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి బాణస్వాద సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేకర్, యస్‌ఐ రంజిత్, ప్రస్తుత బాన్స్‌వాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్, యస్‌ఐ వెంకట్ రావు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై మురళి, సిడివో కిషన్, సలేశ్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు.