కరోన బాధితులకు నిత్య‌వసర సరుకుల పంపిణీ

కామారెడ్డి, జూలై 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిన్‌ కేర్‌ స్మాల్‌ బ్యాంకింగ్‌ అద్వర్యంలో కామారెడ్డి శాఖ నుండి సదాశివనగర్‌ మండలం అమర్లబండ గ్రామంలో శనివారం కరోనా బారిన పడిన ఫిన్‌ కేర్‌ బ్యాంకు ఖాతాదారులకు మేనేజ్‌మెంట్‌ అద్వర్యంలో కామారెడ్డి జిల్లా శాఖ ఫిన్‌ కేర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ మల్లేష్‌ 33 మందికి నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన ఖాతాదారులైన మహిళలతో మాట్లాడుతూ కరోనా విజృంబించి చికిత్స పొందుతున్న క్రమంలో ఏ రోగి ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితిలో సకాలంలో సమయం దృష్టిలో ఉంచుకుని బ్యాంకు నుండి తీసుకున్న ఋణాన్ని చెల్లించారని అన్మారు. అదేవిదంగా అతి తక్కువ వడ్డీకి గోల్డ్‌ లోన్‌ మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాజేశ్వర్‌, బ్యాంక్‌ సిబ్బంది నవీన్‌, నందు, బాల్‌ రెడ్డి, రాజశేఖర్‌, సుమన్‌, రామస్వామి, నరేష్‌, పోచయ్య, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »