కామారెడ్డి, అక్టోబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇటీవల కురిసిన వర్షాల వలన దెబ్బతిన్న రోడ్లు, కాల్వలు, భవనాల, తదితర పనులకు ప్రతిపాదించిన పనులను నాణ్యతతో చేపట్టాలని , పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమేషనర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కురిసిన వర్షాల వలన రోడ్లు, కాల్వలు, తదితర పనులకు ఆయా శాఖలు మరమ్మత్తులకు ప్రతిపాదించడం జరిగిందని, అట్టి పనులను వేగవంతం చేయాలని అన్నారు. చేపడుతున్న పనులను నాణ్యతతో నిర్వహించాలని, ప్రతీ పనికి సంబంధించిన ఫోటోలు సమర్పించాలని తెలిపారు.
ఆయా పనులు పూర్తి చేసి యుటిలైజేషన్ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.